Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్మనకి తెలిసింది ఏంటంటే...

మనకి తెలిసింది ఏంటంటే…

మనకి తెలిసింది ఏంటంటే...
మనకి తెలిసింది ఏంటంటే…

‘మీకు మాత్రమే చెప్తా’. అరే సినిమా పేరు బలేగా ఉంది అనిపిస్తుంది ఎవరికి అయినా. విజయ్ సాయి దేవరకొండ నిర్మాతగా మారి ‘కింగ్ అఫ్ ది హిల్’ నిర్మాణం పేరిట నిర్మిస్తున్నారు ఈ సినిమాని.తన పెళ్లి చూపులు సినిమా దర్శకులు ‘తరుణ్ భాస్కర్’ గారిని హీరో గా పరిచయం చేస్తున్నారు. ‘శామీర్ సుల్తాన్’ సినిమాకి దర్శకులు. శివ కుమార్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

అభినవ్ గౌతమ్, నవీన్ జార్జ్ థామస్, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, అవంతిక మిశ్ర, వినయ్ వర్మ, పావని గంగిరెడ్డి ఇలా చాల పెద్ద తారగానముతో సినిమా ఆధ్యంతం ఉండబోతుంది అని అన్నారు. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ప్రిన్స్ సూపర్ స్టార్ ‘మహేష్ బాబు‘ గారు తన చేతుల మీదిగా నిన్న సాయంతరం 6:00 గంటల సమయంలో విడుదల చేసారు. ఆ వేడుకకి విజయ్ దేవరకొండ మరియు సినిమా యూనిట్ కూడా వచ్చారు. అప్పటికి సినిమా నుండి మొదటి టీజర్ వచ్చింది అందులో “పెళ్ళికి ముందు ప్రియురాలికి అబద్దాలు చెబుతూ తన ఫోన్ లో ఎదో ఇంపార్టెంట్ విషయం ఉంది దానికోసం తెగ కంగారు పడుతున్నాడు” అని తెలిసిపోయింది.

ఇక నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ లో దానికి కొనసాగింపు గా “కథా నాయకుడు తనకి పెళ్లి కొద్దీ సమయంలో ఉంది అనగా తన ఫోన్ లో రికార్డు అయిన ఒక వీడియో బయటికి రావడం, అది చూసి పెళ్లి కూతురు పెళ్లి ఎక్కడ వద్దు అంటుంది అని కంగారు పడుతూ తనలో తాను బాధపడుతూ చుట్టూ ఉన్న ఇద్దరి స్నేహితులకి నరకం చూపిస్తూ, ఇంట్లో తల్లి తండ్రులకి ఆ వీడియో చూస్తే ఎం అంటారో, తనకి పుట్టబోయే బిడ్డకి ఆ వీడియో చూపిస్తూ ఎలా బ్రతకాలి అని ఆద్యంతం సతమతమవుతూ మనల్ని తెగ నవ్విస్తూ, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అన్నట్టుగా ఉంది ట్రైలర్.

జనాలు అందరికి తెగ నచ్చేసింది ఆ సినిమా ట్రైలర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాల మాదిరిగా సింపుల్ గా సాగే కామెడీ ఉండబోతుంది అని సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నవంబర్ 01 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అని విజయ్ దేవరకొండ గారు అన్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు గారు మాట్లాడుతూ…….

”నేను ముందు ఈ సినిమా టీజర్ ని చూసాను చాల బాగా వచ్చింది టీజర్. అదే నమ్మకంతో థియేట్రికల్ ట్రైలర్ ఉండబోతుంది అని చెప్పి మీతో పాటు నేను కూడా చూసాను. నిజంగానే నేను అనుకున్న దానికంటే ఎక్కువగా మంచిగా వచ్చింది ట్రైలర్. సినిమా యూనిట్ వాళ్లందరికీ అలాగే నిర్మాతగా మారిన విజయ్ సాయి దేవరకొండకి ముందుగా కంగ్రాట్యులేషన్స్” అని అన్నారు. ఇక మహేష్ బాబు అలా అనడంతో వారి అభిమానులు కూడా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కి బ్రహ్మరధం పడతారు అని అనుకుంటున్నారు జనాలు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts