HomePolitical Newsకేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్నారు. ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన ‘ఆది శంకర జన్మభూమి క్షేత్రం’లో ఆయన పూజలు చేశారు. ఈ ప్రదేశం కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలో ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ప్రధాని మోదీ ఇక్కడ 45 నిమిషాల పాటు గడిపిన ఆయన ఆదిశంకరాచార్యులవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధాని మోదీ మెడలో రుద్రాక్ష, సంప్రదాయ లుంగీ, అంగవస్త్రం, నిండు చేతుల చొక్కా ధరించి కనిపించారు. కేరళ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించారు. కేరళలో ప్రధాని మోదీ ఈ తరహాలో కనిపించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో 12 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సమయంలో కూడా కూడా రుద్రాక్ష ధరించి కనిపించారు. అంతకుముందు, నెడుంబస్సేరిలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశంలోని ఈ దార్శనిక సాధువుల సహకారాన్ని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

కేరళలోని శ్రీనారాయణ గురు, చట్టంపి స్వామికల్, అయ్యంకాళి వంటి అనేక మంది సాధువులు, సంఘ సంస్కర్తలు ఆదిశంకరుల వారసత్వాన్ని పొందారని అన్నారు. ఆదిశంకరులు తన ‘అద్వైత’ తత్వానికి ప్రసిద్ధి చెందారు. ఆదిశంకరుల జన్మస్థలాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ ప్రదేశం పెరియార్ నది ఒడ్డున ఉంది. జగద్గురు ఆది శంకరాచార్య క్రీస్తు పూర్వం 509 విభవ నామ సంవత్సరం శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది.

ఆర్యమాంబ శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం ఆయన జీవన కాలం క్రీస్తూ పూర్వం 509 – క్రీస్తూ పూర్వం 477 అని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All