Homeన్యూస్ప్రేమెంత పనిచేసే నారాయణ రివ్యూ

ప్రేమెంత పనిచేసే నారాయణ రివ్యూ

prementha panichese narayanaప్రేమెంత పనిచేసే నారాయణ రివ్యూ

నటీనటులు : జొన్నలగడ్డ హరికృష్ణ , అక్షిత , ఝాన్సీ

- Advertisement -

సంగీతం : వినోద్ యాజమాన్య

నిర్మాత : సావిత్రి జొన్నలగడ్డ

దర్శకత్వం : జొన్నలగడ్డ శ్రీనివాస్

రేటింగ్ : 3/ 5

రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2019

 

సీనియర్ దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ తన తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ” ప్రేమెంత పనిచేసే నారాయణ ” . ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :
హరి ( హరికృష్ణ ) ఓ అనాథ , స్క్రాప్ షాప్ లో పనిచేసే హరి శిరీష ( అక్షిత ) ని చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు . శిరీష కూడా హరిని ప్రేమిస్తుంది అయితే గయ్యాళి అయిన  శిరీష తల్లి వాళ్ళ ప్రేమకు అంగీకరించదు . ఆ గయ్యాళికి  తోడు నగర మేయర్ రాజేశ్వరి  ( ఝాన్సీ ) నుండి ప్రేమ జంటకు ప్రాణహాని ఏర్పడుతుంది . మేయర్ ని ఎదిరించి తన ప్రేమని ఎలా పొందాడు ? అసలు మేయర్ తో ఈ జంటకు వచ్చిన ఇబ్బంది ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

జొన్నలగడ్డ హరికృష్ణ

అక్షిత

ఝాన్సీ

సంగీతం

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

హీరోగా జొన్నలగడ్డ హరికృష్ణ నటనలో అలాగే డ్యాన్స్ లో ఫైట్స్ లలో బాగా మెప్పించాడు . నటనకు కొత్తవాడు అయినప్పటికీ ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు . మాస్ హీరోగా హరి మెప్పించగలడు . అక్షిత అందంగా ఉంది అంతకంటే బాగా నటించింది కూడా . హరికృష్ణ – అక్షిత జంట బాగుంది , ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదిరింది . మేయర్  క్యారెక్టర్ లో ఝాన్సీ అలరించింది . హీరో ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు కూడా ఆకట్టుకున్నారు .

సాంకేతిక వర్గం :

జొన్నలగడ్డ శ్రీనివాసరావు రొటీన్ స్టోరీ నే ఎంచుకున్నప్పటికీ దాన్ని ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు . యువతకు కావాల్సిన అన్ని అంశాలను చేర్చి పక్కా కమర్షియల్ చిత్రంగా మలిచాడు ప్రేమెంత పనిచేసే నారాయణ చిత్రాన్ని . యాజమాన్య అందించిన పాటలు బాగున్నాయి , నేపథ్య సంగీతం తో కూడా ఆకట్టుకున్నాడు . విజువల్స్ బాగున్నాయి , నిర్మాణ విలువలతో సినిమా మేకింగ్ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటిచెప్పింది జొన్నలగడ్డ సావిత్రి .

ఓవరాల్ గా :

ప్రేమికుల కోసమే ఈ  ప్రేమెంత పనిచేసే నారాయణ

 

English Title: prementha panichese narayana movie review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All