
రచన, దర్శకత్వం: మురళీస్వామి (ఎం.ఆర్)
నిర్మాత: పి.యస్. రామకృష్ణ
నటీనటులు: జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా, సొనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌పుత్, మమత శ్రీచౌదరి, `ఢీ జోడీ` ఫేం అంకిత, బిగ్‌బాస్ ఫేమ్ బందగి కర్ల, సంజన చౌదరి, సుమన్, భార్గవ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటించారు.
సంగీతం: ఆర్స్
సినిమాటోగ్రఫీ: తిరుమల రోడ్రిగ్జ్
ఎడిటింగ్ : ఎస్. శివకిరణ్
రేటింగ్: 3/5
తెలుగు ప్రేక్షకులు కొత్త కథలకు పట్టంకడుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ బేస్డ్ సినిమాలు ఈ మధ్య ఆదరణ పొందుతున్నాయి. అందులో ప్రేమకథలదే అగ్రతాంబూలం. దీంతో సరికొత్త కథలతో కొత్త దర్శకులు సినిమాలు చేస్తున్నారు. ఆ కోవలో వచ్చిన చిత్రం `ప్రేమ పిపాసి`. ఈ చిత్రం ద్వారా జిపిఎస్ హీరోగా పరిచయమయ్యారు. ఫస్ట్‌లుక్ టీజర్ నుంచే కొత్త తరహా ప్రేమకథగా ఆసక్తికి క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా?. ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికిందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
బావ (జీపీఎస్) పేరుకు తగ్గట్టే అతనికి అమ్మాయిలంటే పిచ్చి. అవకాశం చిక్కినప్పుడల్లా అమ్మాయితో తిరుగుతూ వుంటాడు. అలాంటి యువకుడికి బాల (కపిలాక్షి మల్హోత్రా) కనిపిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా తొలి చూపులోనే బాలాతో ప్రేమలో పడిపోతాడు. మె స్రేమలో తడిసి ముద్దవ్వాలనుకుంటాడు. ఆమె ఆరాధనలో ప్రేమ పిపాసిగా మారిపోతాడు. అయితే అతని గురించి తెసుకున్న కపిలాక్షి మల్హోత్రా బాలా బావ ప్రేమని అంగీకరించిందా? .. ఇంతకీ బావ ఎవరు? అతనికున్న గతం ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన జీపీఎస్ తనకు తొలి చిత్రమే అయినా ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా మంచి ఈజ్‌తో నటించాడు. ఓ నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లోని రొమాంటిక్ సన్నివేశాల్లో, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్‌లలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కపిలాక్షి మల్హోత్రా తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. గ్లామర్ సన్నివేశాల్లో ఎలాంటి మోహమాటాన్ని ప్రదర్శించలేదు. సుమన్ కీలక పాత్రలో నటించి సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాడు. మిగతా పాత్రల్లో నటించిన సొనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌పుత్, మమత శ్రీచౌదరి, `ఢీ జోడీ` ఫేం అంకిత, బిగ్‌బాస్ ఫేమ్ బందగి కర్ల, సంజన చౌదరి, భార్గవ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణులు:
ఓ రియలిస్టిక్ లవ్‌స్టోరీని అంతే అథెంటిక్‌గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథా, కథనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుకోవాల్సింది. ప్రేమకథా చిత్రం కావడం, అందులోనూ వాస్తవికతకు అద్దంపట్టే స్థాయిలో సినిమా వుండాలని చేసిన ప్రయత్నానికి సినిమాటో గ్రాఫర్ తిరుమల రోడ్రిగ్జ్ తన వంతు పాత్రని సమర్థవంతంగా పోషించి సినిమాకు అదణపు హంగుల్ని అందించాడు. ఫొటోగ్రఫీ బాగుంది. సంగీతం ఆర్స్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. మరింతగా ఈ విషయంలో దృష్టిపెడితే మ్యూజికల్‌గా సినిమాకు ప్లస్ అయ్యేది. శివకిరణ్ ఎడిటింగ్ ఫరవాలేదనిపించింది. ఇక తొలి చిత్రమైనా నిర్మాత పి.యస్. రామకృష్ణ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. నిర్మాణ విలువలుబాగున్నాయి.
విశ్లేషణ:
ఓ రియలిస్టిక్ లవ్‌స్టోరీని అంతే అథెంటిక్‌గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు మురళీస్వామి ప్రయత్నించాడు. అయితే కథా, కథనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే ఫలితం మరింతగా బాగుండేది. సరికొత్త ప్రేమకథని ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం నూటికి నూరు శాతం కాకపోయినా కొంత వరకు ఫరవాలేదనిపించింది. ఓవరాల్‌గా సగటు మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలన్నీ పుష్కలంగా వున్న ఈ సినిమా ఆ క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మాత్రం చెప్పొచ్చు.