Homeన్యూస్ప్రేమ అంత ఈజీ కాదు రివ్యూ

ప్రేమ అంత ఈజీ కాదు రివ్యూ

prema antha easy kadu movie reviewప్రేమ అంత ఈజీ కాదు రివ్యూ :
నటీనటులు : రాజేష్ కుమార్ , ప్రజ్వల్ , శ్రీధర్
సంగీతం : జై యం
నిర్మాతలు : శ్రీధర్ , నరేష్ , అంజయ్య
దర్శకత్వం : ఈశ్వర్
రేటింగ్ :3 /5

రాజేష్ కుమార్ – ప్రజ్వాల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో అంజయ్య , శ్రీధర్ , నరేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” ప్రేమ అంత ఈజీ కాదు ”. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా !

- Advertisement -

కథ :

కార్తీక్ ( రాజేష్ కుమార్ ) ప్రేమ ( ప్రజ్వల్ ) ని ప్రేమిస్తుంటాడు . అయితే ప్రజ్వల్ కూడా కార్తీక్ ని ప్రేమిస్తుంది కానీ ఆ విషయాన్నీ ఎప్పుడూ కార్తీక్ కు చెప్పదు . ప్రేమ ప్రేమ కోసం కార్తీక్ మాత్రం తపించి పోతుంటాడు . తన ఇంట్లోనే ప్రేమ ఉన్నప్పటికీ ఆమెకు దూరంగా తండ్రి తో విభేదించి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు . అయితే తను రూపొందించిన  ఆల్బమ్ ని ప్రేమ కు చూపించడంతో ప్రేమ  కార్తీక్ కు దూరం అవుతుంది ? అసలు కార్తీక్ రూపొందించిన ఆల్బమ్ లో ఏముంది ? ప్రేమ అతడ్ని ఎందుకు దూరం పెట్టింది ? చివరకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

స్వచ్ఛమైన ప్రేమ

డ్రా బ్యాక్స్ :

కొన్ని విజువల్స్

నటీనటుల ప్రతిభ :

కార్తీక్ పాత్రలో బాగా రాణించాడు రాజేష్ కుమార్ . నటనలోనే కాకుండా యాక్షన్ సీన్స్ లలో కూడా మెప్పించాడు . డ్యాన్స్ , ఫైట్స్ లలో కూడా సత్తా చాటాడు . ప్రేమ పాత్రలో ప్రజ్వల్ మెప్పించింది . తనకు నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించడంతో తన అభినయంతో ఆకట్టుకుంది . ఇక బాస్ పాత్రలో శ్రీధర్ కూడా మెప్పించాడు . నరేష్ తో పాటుగా హీరో ఫ్రెండ్స్ కూడా ఆకట్టుకున్నారు . ఇక జబర్దస్త్ బ్యాచ్ ధన్ రాజ్ , అవినాష్ , ఆటో రాంప్రసాద్ లు తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు .

సాంకేతిక వర్గం :

పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు అంజయ్య , శ్రీధర్ , నరేష్ లు . మొదటి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా నిరూపించుకున్నారు . డబ్బుల కోసం అశ్లీల చిత్రాలను ఎంచుకోకుండా స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రాన్ని ఎంచుకున్నారు . జై ఎం అందించిన పాటల్లో మూడు పాటలు  బాగున్నాయి , అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . విజువల్స్ అక్కడక్కడా ఇబ్బంది పెట్టాయి . ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది , అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్తా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది .

ఓవరాల్ గా :

ప్రేమ అంత ఈజీ కాదు ……

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All