Homeటాప్ స్టోరీస్ఈ విషయంలో చైతన్య సైలెంట్ గా ఉండటం ఎక్కువ బాధించింది - సామ్ స్టైలిస్ట్

ఈ విషయంలో చైతన్య సైలెంట్ గా ఉండటం ఎక్కువ బాధించింది – సామ్ స్టైలిస్ట్

ఈ విషయంలో చైతన్య సైలెంట్ గా ఉండటం ఎక్కువ బాధించింది - సామ్ స్టైలిస్ట్
ఈ విషయంలో చైతన్య సైలెంట్ గా ఉండటం ఎక్కువ బాధించింది – సామ్ స్టైలిస్ట్

నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం సద్దుమణుగుతుంది అనుకునే లోపే అది ఇంకా ఇంకా వివాదాస్పదమవుతోంది. ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాతి నుండి సమంతను కారణంగా ఎత్తి చూపుతూ చాలా మంది ఎవరికి వారీ కథనాలు అల్లేశారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సమంతకు సోషల్ మీడియాలో ఐ లవ్ యూ చెప్పడం, ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి తర్వాత డిలీట్ చేయడం వంటివి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, అదే విడాకుల వరకూ దారి తీసిందని చెప్పుకుంటూ వచ్చారు.

రీసెంట్ గా సామ్ తనకు ఎటువంటి ఎఫైర్లు లేవని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ప్రీతమ్ ఈ ఇష్యూపై స్పందించాడు. నాకు సమంత సోదరి వంటిదని, జీజీ అని సంబోధిస్తానని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ టోటల్ ఇష్యూపై నాగ చైతన్య స్పందించకపోవడం తనను మరింత బాధించిందని ప్రీతమ్ అభిప్రాయపడ్డాడు. చైతూ కనుక మాట్లాడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నాడు. ఐ లవ్ యూ చెప్పడంపై కూడా క్లారిటీ ఇచ్చాడు ప్రీతమ్.

- Advertisement -

కుటుంబ సభ్యులకు, ఇంట్లో సోదరికి చెప్పినట్లే తాను సమంతకు ఐ లవ్ యూ చెప్పానని అన్నాడు. ఇప్పుడు వస్తోన్న వార్తలు తనను బాధిస్తున్నాయని, చాలా మంది మెసేజ్ లలో బెదిరిస్తున్నారని, చంపేస్తామని ఫోన్ చేస్తున్నారని ప్రీతమ్ అన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All