సాయి తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ప్రతిరోజూ పండగే అంచనాలను మించి పెర్ఫర్మ్ చేస్తోంది. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లు ట్రేడ్ ను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ పండగే టైటిల్ కు అనుగుణంగానే బయ్యర్లకు, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, పండగను తీసుకొచ్చింది. సరైన రిలీజ్ టైమ్ దొరికితే అది సినిమాకు ఎంత ప్లస్ అవుతుంది అనే దానికి ఈ చిత్రం ఒక చక్కటి ఉదాహరణ. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే సంచలనాలు సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఈ సినిమా హిట్ అయితే చాలనుకున్నారు. యావరేజ్ రేటింగులతో మొదలైన ఈ చిత్ర ప్రయాణం, అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే మొదటి రోజు వసూళ్ల కంటే 13వ రోజు వసూళ్లు ఎక్కువ వచ్చేలా.
ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనడానికి పై ఉదాహరణ బెస్ట్. నైజాంలో ఈ చిత్రం 10 కోట్ల షేర్ ను క్రాస్ చేసింది. అలాగే మొత్తంగా కూడా ప్రతిరోజూ పండగే దాదాపు 30 కోట్ల షేర్ మార్క్ కు చేరువగా వచ్చింది. 18 కోట్లకు బిజినెస్ కాబడిన ఈ చిత్రం ఎంత మేర ప్రాఫిట్స్ రాబట్టిందో చూసుకోవచ్చు.
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశి ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే, సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అవతరించింది. ఇన్నాళ్లు హిట్లు లేక అల్లాడిపోయిన తేజ్ కు భారీ హిట్ తో కొరత మొత్తం తీరిపోయింది.
ప్రతిరోజూ పండగే 13 రోజుల వసూళ్ల బ్రేక్ డౌన్ ఇప్పుడు చూద్దాం:
నైజాం – 10.60 కోట్లు
సీడెడ్ – 3.36 కోట్లు
గుంటూరు – 1.65 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.91 కోట్లు
తూర్పు గోదావరి – 1.75 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.35 కోట్లు
కృష్ణా – 1.75 కోట్లు
నెల్లూరు – 0.78 కోట్లు
13 డేస్ మొత్తం షేర్ – 25.15 కోట్లు
కర్ణాటక + ఇండియా – 1.91 కోట్లు
ఓవర్సీస్ – 2.51 కోట్లు
వరల్డ్ వైడ్ 13 డేస్ కలెక్షన్స్ – 29.57 కోట్లు
జనవరి 9 నుండి సంక్రాంతి సినిమాల హంగామా మొదలవుతుంది కాబట్టి మరో వారం రోజులు ప్రతిరోజూ పండగే బాక్స్ ఆఫీస్ వద్ద పండగ చేసుకోవడం ఖాయం. ఈ సినిమా ఫుల్ రన్ 35 కోట్లకు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. అంటే పెట్టిన పెట్టుబడికి డబల్ లాభాలు అన్నమాట.