Homeటాప్ స్టోరీస్అ! దర్శకుడి వెబ్ సిరీస్ హంగామా

అ! దర్శకుడి వెబ్ సిరీస్ హంగామా

అ! దర్శకుడి వెబ్ సిరీస్ హంగామా
అ! దర్శకుడి వెబ్ సిరీస్ హంగామా

అ! వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. తన సినీ ప్రయాణం విభిన్నంగా ఉంటుందని ప్రూవ్ చేస్తూ కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలను చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా ప్రశాంత్ వర్మ టాలెంట్ ను చూపిస్తాయి. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తోన్న ప్రశాంత్ వర్మ, వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టాడు.

యువ దర్శకులకు వెబ్ సిరీస్ లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో వివిధ ఓటిటి సంస్థలకు వెబ్ సిరీస్ లకు కథలను అందించి డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ హాట్ స్టార్ కోసం ఒక కథను అందించాడట. అది ఇప్పటికే నిర్మాణంలో ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఓటిటిల కోసం తన వద్ద మరో రెండు కథలు ఉన్నాయని చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఒకటి హిందీలో, మరొకటి తెలుగులో సెట్ అవుతుందని అంటున్నాడు. సోషియో ఫాంటసీ కథ చేయాలని ఉందని అంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే దీనికి తగ్గ వర్క్ మొదలుపెట్టినట్లు చెబుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All