
ఈ మధ్య హీరోయిన్స్ అంత కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్నీ ఏమాత్రం దాచుకోకుండా ఫ్యాన్స్ కు తెలియజేస్తూ..ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు బేబీ బంప్ తో సరికొత్త ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ అలాగే చేస్తుంది. వారంలో రెండు , మూడు ఫోటో షూట్స్ తో వైరల్ అవుతూ వస్తుంది. తాజాగా అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత కూడా కడుపుతో ఉంది. రీసెంట్ గా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
తొలి సారి తల్లి కాబోతున్నానని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. తాజాగా బేబీ బంప్ ని చూపిస్తూ ప్రణీత కవ్విస్తున్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇంట్లో అద్దం ముందు నించుని బేబీ బంప్ ని చూపిస్తూ కన్ను కొడుతూ ఫొటోలకు పోజులిచ్చిన ఓ ఫొటోని అభిమానులకు షేర్ చేసింది.ఈ ఫొటోకు ఆసక్తికరమైన క్యాప్షన్ ని కూడా జత చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లు ప్రతీ రోజు ఇలా అద్దం ముందు నుంచుని బేబీ బంప్ ని చెక్ చేసుకోవచ్చు అంటూ కొంటెగా క్యాప్షన్ ఇచ్చింది.