Homeటాప్ స్టోరీస్మోడీపై నిప్పులు చెరిగిన ప్రకాష్ రాజ్

మోడీపై నిప్పులు చెరిగిన ప్రకాష్ రాజ్

Prakash raj sensational comments on Modi ప్రధాని నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ . డిమానిటైజేషన్ పేరుతో ముందస్తు చర్యలు తీసుకోకుండా పెద్ద నోట్లని రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేశాడని ,అలాగే దేశంలో దారిద్య్రం తాండవిస్తుంటే మూడు వేల కోట్లతో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందా ? అంటూ నేరుగా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్. గతకొంత కాలంగా భారతీయ జనతా పార్టీని , నరేంద్ర మోడీ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు ప్రకాష్ రాజ్. రెండేళ్లుగా అదేపనిగా మోడీ వ్యవహార శైలి పట్ల ఆరోపణలు చేస్తున్నాడు ప్రకాష్ రాజ్.

పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు మోడీ అండ్ కో కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే దానికి భిన్నంగా ఉంది . నోట్ల రద్దుతో ఇప్పటికి కూడా బ్యాంక్ లలో తమ డబ్బుని పూర్తి స్థాయిలో డ్రా చేసుకోలేకపోతున్నారు ప్రజలు. అలాగే డిజిటల్ ఇండియా అంటూ ప్రచారం మొదలు పెట్టారు కానీ క్యాష్ కాకుండా కార్డ్ వాడితే 2 పర్సెంట్ మోత మోగుతూనే ఉంది. దాంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం విషయానికి వస్తే….. భారీ ఎత్తున నిర్మించిన ఈ విగ్రహం ఖర్చు 3000 కోట్లు. దాంతో ఇంతటి పెద్ద మొత్తాన్ని దారిద్ర్యం లో ఉన్న పేదల కోసం వినియోగించాలి కానీ ఇలా దుబారా చేయడం అవసరమా ? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ , ఆంద్రప్రదేశ్ లలో తుఫాన్ భీభత్సం సృష్టిస్తే అక్కడ పెద్దగా సహాయం అందించిన దాఖలాలు లేవు కానీ ఇలా ఖర్చు చేయడం ఏంటి ? అని నిలదీస్తున్నాడు ప్రకాష్ రాజ్.

- Advertisement -

English Title: Prakash raj sensational comments on Modi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All