Homeఎక్స్ క్లూసివ్ప్రకాష్ రాజ్ పోటీ చేసేది ఎక్కడి నుండో తెలుసా

ప్రకాష్ రాజ్ పోటీ చేసేది ఎక్కడి నుండో తెలుసా

Prakash raj contesting from Bengalur central బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . తాజాగా ఎక్కడి నుండి పార్లమెంట్ కు పోటీ చేయబోతున్నాడో కూడా ప్రకటించాడు . కర్ణాటక లోని బెంగుళూర్ సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ గా పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ . రాజకీయాల్లోకి వస్తున్నట్లు , పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని , నా రాకని అందరూ స్వాగతిస్తున్నారని నాకు మద్దతు ప్రకటించిన అందరికీ కృతఙ్ఞతలు అంటూ మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ .

గత ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి విజయం కోసం ప్రకాష్ రాజ్ కష్టపడ్డాడు . అలాగే భారతీయ జనతా పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు . దాంతో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వొచ్చు . ప్రకాష్ రాజ్ మాత్రం ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు .

- Advertisement -

English Title: Prakash raj contesting from Bengalur central

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All