
కొంత మందికి టాలెంట్ వున్నా కాలం కలిసి రాదు. కొంత మందికి టాలెంట్ సోసో అయినా కాలంతో పాటు అదృష్టం కూడా వైఫైలా చుట్టూ తిరిగేస్తూ వుంటుంది. ప్రగ్యా జైస్వాల్ ది మొదటి సూత్రం పక్కాగా సరిపోతుంది. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎట్రీ ఇచ్చినా ప్రగ్యాకు పేరు తెచ్చింది మాత్రం క్రిష్ తెరకెక్కించిన `కంచె`.
ఈ మూవీ తరువాత ప్రగ్యా చేసిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మనోజ్‌తో చేసిన `గుంటూరోడు`, నాగ్‌తో చేసిన ఓం నమో వెంకటేశాయ, కృష్ణవంశీ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌తో చేసిన `నక్షత్రం` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ప్రగ్యా జైస్వాల్ `ఆచారి అమెరికా యాత్ర` తరువాత మరో చిత్రంలో కనిపించలేదు. కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు కోసం ప్రగ్యా ట్రై చేస్తోంది.
`కంచె`తో వచ్చిన సాఫ్ట్ హోహ్లీ హీరోయిన్ ఇమేజ్‌ని చెరిపేసుకుని గ్లామర్ స్టార్‌గా ఎదగాలని తాపత్రయపడుతోంది. ఇందు కోసం గత కొన్ని నెలలుగా వరుస హాట్ ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇన్ స్టా వేదికగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో మరింత గ్లామర్‌గా కనిపిస్తూ హాట్ క్యారెక్టర్‌లకు సై అనే సంకేతాలిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.