
అఖండ బ్యూటీ ప్రగ్యా రోజు రోజుకు రెచ్చిపోతుంది. 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లోనటించిన ఈ బ్యూటీ.. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది. 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది.
ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి కానీ అవేవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. రీసెంట్ గా అఖండ మూవీ తో అసలు సిసలైన హిట్ కొట్టి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ పాపులార్టీ ని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. రోజు రోజుకు తనలోని హాట్ యాంగిల్స్ ను బయటకు తీస్తూ వామ్మో అనుకునేలా చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో హాట్ లుక్ లో కనిపించి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.