Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ 4పై న‌టి ప్ర‌గ‌తి కాంమెంట్స్‌!

బిగ్‌బాస్ 4పై న‌టి ప్ర‌గ‌తి కాంమెంట్స్‌!

Pragathi comments on big boss season 4
Pragathi comments on big boss season 4

బిగ్ బాస్ సీజ‌న్ 4 పై అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. క‌రోనా ఉదృతి ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నా బిగ్ బాస్ మేక‌ర్స్ మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. మూడు కోట్ల భారీ వ్య‌యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ అన్న విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో సీజ‌న్ 4లో పాల్గొని ర‌చ్చ చేసే కంటెస్టెంట్‌లు ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుత చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ జాబితాలో న‌టి ప్ర‌గ‌తి పేరు కూడా వినిపిస్తోంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టి ప్ర‌గ‌తి బిగ్‌బాస్ పై ప‌‌లు ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేసింది. బిగ్‌బాస్ సీజ‌న్‌లో పాల్గొనాల‌నుకునే వారు రెండు కార‌ణాల‌తో వెళతార‌ని, ఒక‌టి డ‌బ్బు పేరు తెచ్చుకోవ‌డానిక‌ని, మ‌రొక‌టి ఆ పేరుని మార్చు కోవ‌డానికని వెల్ల‌డించింది.

- Advertisement -

అయితే ఈ రెండింటి అవ‌స‌రం త‌న‌కు లేద‌ని, స్ప‌ష్టం చేసింది. త‌న‌కు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు వుంద‌ని, త‌ను ఎక్క‌డికి వెళ్లినా గుర్తిస్తార‌ని, బిగ్‌బాస్‌కు వెళ్లే అవ‌స‌రం త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All