Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్ప్రదీప్ కు ఏమైంది.. సమాధానమిదిగో!

ప్రదీప్ కు ఏమైంది.. సమాధానమిదిగో!

ప్రదీప్ కు ఏమైంది.. సమాధానమిదిగో!
ప్రదీప్ కు ఏమైంది.. సమాధానమిదిగో!

తెలుగులో మోస్ట్ పాపులర్ మేల్ యాంకర్ గా ప్రదీప్ పేరు చెప్పుకోవచ్చు. తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టడం, అతికి పోకుండా డీసెంట్ గా తన పని తను చేసుకెళ్ళడం ప్రదీప్ స్టైల్. అందుకే చాలా తక్కువ కాలంలో ప్రదీప్ యాంకర్ గా తెలుగు రాష్ట్రాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రదీప్ యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే సడెన్ గా కనిపించకుండా పోయాడు. చేస్తున్న షో లు అన్నీ ఆపేసి నెల రోజులవుతున్నా ఇంకా ప్రదీప్ జాడ తెలియలేదు. దీంతో ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. ప్రదీప్ కు ఏమైందంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కొందరు అనారోగ్యం కారణంగా ప్రదీప్ ఇలా షో లకు దూరమయ్యాడనే ప్రచారం చేస్తే, మరికొందరు ప్రదీప్ కు పెద్ద యాక్సిడెంట్ అయిందని దాని నుండి కోలుకోవడానికి ఇలా రెస్ట్ తీసుకుంటున్నాడని అన్నారు. ఇక కొందరైతే ఏకంగా ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడని అందుకే ఈ రెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా భిన్న వార్తలు తెరపైకి రావడంతో ప్రేక్షకుల్లో ఆందోళన ఎక్కువైంది. ఆ మధ్య యాంకర్ రవి కూడా ప్రదీప్ ఏం అయిపోలేదని చిన్న అనారోగ్య సమస్య, మరో నెల రోజుల్లో షోస్ కు తిరిగి వస్తాడని భరోసా ఇచ్చాడు.

- Advertisement -

అయితే ఇంత జరుగుతున్నా ప్రదీప్ ఎందుకని ఏం మాట్లాడట్లేదు, పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ యాంకర్ ప్రదీప్ నిన్న రాత్రి సోషల్ మీడియాలో లైవ్ కొచ్చి తనకేమి అయిపోలేదని, ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని చెప్పాడు. తన గురించి ఇన్నాళ్ళుగా ఆందోళన పడుతున్న వారికోసం తన క్షేమ సమాచారాలు వెల్లడించాడు. నాకోసం ఆరాలు తీసి, నాకేమైందా అని ఆందోళన చెందిన వారికి కృతఙ్ఞతలు, కొన్ని రోజుల క్రితం షూట్ సందర్భంగా కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. అయినా కానీ దాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగించాను. కానీ అది తగ్గకుండా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది.

డాక్టర్లు కొన్నాళ్ళు నిల్చోకుండా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. అందుకే కష్టమైనా షోస్ కు దూరంగా ఉంటూ వస్తున్నాను. కాలు పైకి పెట్టుకుని టివి చూస్తూ కాలం గడుపుతున్నాను. చూస్తున్నారుగా గెడ్డాలు, మీసాలు ఎంతలా పెంచేసానో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రదీప్ ఇలా నవ్వుతూ సరదాగా మాట్లాడడంతో ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాలికి ఫ్రాక్చర్ కారణంగా షోస్ కు దూరమయ్యా అని చెప్పిన ప్రదీప్ త్వరలో మరింత ఉత్సాహంతో షూట్స్ కు హాజరవుతానని భరోసా ఇచ్చాడు. తన గురించి ఆందోళన చెందిన ప్రజలకు మరోసారి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు ప్రదీప్.

సో, ఒక్క వీడియోతో తనపై ప్రచారంలో ఉన్న రూమర్లన్నిటికీ ప్రదీప్ చెక్ పెట్టినట్లయింది. ఢీ డ్యాన్స్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పాటు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కూడా గాయానికి ముందు నిర్వహిస్తున్నాడు ప్రదీప్. ఈ రెండు షో లతో పాటు పలు ఈవెంట్లకు కూడా ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించలేకపోయాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts