
గ్రేజీ డ్యాన్స్, డైరెక్టర్ ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న వివషయం తెలిసిందే. తన సమీప బంధువునే ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభుదేవా ఇటీవలే వివాహం చేసుకున్నారని తెలిసింది.
ఆమె ఫిజియో థెరపిస్ట్ అని అత్యంత సన్నిహితుల మథ్య వీరి వివాహం జరిగిందని తెలిసింది. దీంతో ఈ వివాహానికి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా ప్రభుదేవా ఆహ్వానించలేదట. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా 47 ఏళ్ల వయసులో మళ్లీ వివాహం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గత రెండు నెలలుగా తన పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నా ప్రభుదేవా మాత్రం పెదవి విప్పడం లేదు.
త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి తన భార్యను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడని తెలిసింది.
ప్రభుదేవా తన మొదటి భార్య రమలత నుండి విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. నయనతారతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ని కొనసాగించిన సమయంలో రమలతకు విడాకులిచ్చారు ప్రభుదేవా. గత కొంత కాలంగా ఒంటరిగా వుంటున్నారు.