Homeటాప్ స్టోరీస్ప్రభుదేవా టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు?

ప్రభుదేవా టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు?

 

Prabhudeva re entry into Tollywood next year
Prabhudeva re entry into Tollywood next year

ప్రభుదేవా పరిచయం అక్కర్లేని పేరు. “చికుబుకు చికుబుకు రైలే” అంటూ, “టేకిటీజీ ఊర్వశీ”.. అంటూ ఆయన తెరపై డ్యాన్సులు వేస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. కొరియోగ్రాఫర్ కా కంటిన్యూ చేస్తూనే, హీరోగా పలు హిట్ సినిమాలు చేసాడాయన. ఒకరకంగా చెప్పాలంటే హీరో అవ్వాలంటే అందం, రూపం, పర్సనాలిటీ, కలర్ ఇవేవీ అక్కర్లేదు అనీ, మంచి కథతో పాటు మనలో టాలెంట్ ఉంటె చాలు అని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన వ్యక్తి అతను. 5,6,7,8 అంటూ కౌంట్ చెప్తూ డ్యాన్స్ స్టెప్స్ వేసినట్లు కాకుండా, ఆయన కంపోజ్ చేసిన పాట చూస్తే ఒక 5 నిమిషాల పాటతోనే ఆ సినిమా గురించి మనకు ఎంతో అర్ధం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది.

- Advertisement -

దివంగత నటుడు శ్రీహరి గారు ప్రధానపాత్రలో నటించిన “నువ్వొస్తానంటే నేనొద్దంటాన” సినిమాతో ప్రభుదేవా దర్శకుడిగా మారారు. పౌర్ణమి; శంకర్ దాదా జిందాబద్ సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభు క్రేజ్ అస్సలు తగ్గలేదు. చాలకాలంగా హిట్ లేని సల్మాన్ ఖాన్ కు వాంటెడ్ రూపంలో హిట్ ఇచ్చి, మళ్ళీ ట్రాక్ లోకి తెచాడు ప్రభుదేవా. బాలీవుడ్ లో పూర్తిస్థాయిలో దర్శకునిగా కొనసాగుతూ, పెద్ద సినిమాలు తీస్తూ, అదే సమయంలో ABCD & ABCD 2 సినిమాలలో హీరోగా కూడా చేసాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దేవి, గులేబగావాలి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభు డైరెక్షన్ చేసిన దబాంగ్ – 3 సినిమా ఈ నెల అనగా dec 20 భారీఎత్తున రిలీజ్ కానుంది. ఇక ఇంతకాలం నుండి బాలీవుడ్ లో ఉన్నా, హిందీ లో మాట్లాడలేడు అని ; ప్రభుదేవా కి డైరెక్షన్ ఇస్తే అన్ని విషయాలలో సగం డైరెక్షన్ సదరు హీరోలే చేస్తారనే విమర్శలు వస్తున్నా ప్రభు సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక గతంలో ప్రభుదేవా చిరంజీవి సహా, పలు హీరోలకు కథలు చెప్పాడు . అయితే మన హీరోలు సరిగా స్పందించలేదు. ఇప్పుడు దబాంగ్ 3 సినిమాతో ఆల్ టైం హై లో ఉన్న ప్రభు వచ్చే ఏడు అయినా, ఒక మంచి కమర్షియల్ కథతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇస్తే ఇక ఆయనకు ఇండియాలో తిరుగుండదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All