Homeటాప్ స్టోరీస్ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారా?

ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారా?

ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారా?
ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారా?

న్ర‌ముఖ డ్యాన్స్ మాప్ట‌ర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారా? .. మ‌రోసారి పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌తంలో భార్య రమ‌ల‌త‌తో మ‌న‌స్ప‌ర్థ‌లతో పాటు ఓ స్టార్ హీరోయిన్ ని వివాహం చేసుకోవాల‌నుకున్నార‌ని ప్రచారం జ‌రిగింది. అందులో న‌య‌న‌తార పేరు ప్ర‌ధానంగా వినిపించింది. ఆమెతో ప్రేమాయ‌ణం కార‌ణంగా ప్ర‌భుదేవా వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

ఆ త‌రువాత ర‌మ‌ల‌త‌తో విడిపోయిన ప్ర‌భుదేవా చాలా కాలంగా ముంబైలోనే వుంటున్నారు. తాజాగా ప్ర‌భుదేవా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డార‌ని, త‌న బంధువుని ప్రేమిస్తున్నార‌ని, ఆమె కూడా ప్ర‌భుదేవాని ప్రేమిస్తున్నార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. వీరిద్ద‌రు త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నార‌ని కోలీవుడ్‌లో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ వార్త‌ల‌పై ప్ర‌భుదేవా మౌనం వ‌హిస్తున్నారు. త‌న పెళ్లి వార్త‌ల్ని ఖండించ‌డం లేదు. దీంతో కోలీవుడ్‌లో ఈ వార్త ప్ర‌ధానంగా వైర‌ల్ అవుతోంది. స‌ల్మాన్‌ఖాన్‌తో గ‌త ఏడాది `ద‌బాంగ్ 3`ని అందించి విజ‌యాన్ని సొంతం చేసుకున్న ప్ర‌భుదేవా ప్ర‌స్తుతం స‌ల్మాన్‌తో `రాధే` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All