Monday, August 15, 2022
Homeటాప్ స్టోరీస్ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?

ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?

ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?
ప్రభాస్ 20.. ఇప్పుడంతా సెట్ అయినట్టేనా?

ఒక సినిమా సక్సెస్ కాగానే దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నేల విడిచి సాము చేయడం అనేది అంత మంచి పద్దతి కాదు. కథకు తగ్గట్లుగానే ఏ సినిమాకైనా ఖర్చు ఉండాలి. మనకి క్రేజ్ ఉంది, బిజినెస్ ఈజీగా అయిపోతుంది కదాని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళిపోతే రిజల్ట్ సాహో తరహాలో ఉంటుంది. ప్రభాస్ కు బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో విపరీతమైన గుర్తింపు వచ్చింది. నార్త్ లో ప్రభాస్ ను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. అంతే సాహోకు బడ్జెట్ పెరిగిపోయింది. మొదట 50 కోట్లలో తీద్దామనుకున్న సాహో బాహుబలి సక్సెస్ తో బడ్జెట్ 300 కోట్లకు చేరుకుంది. అనవసర హంగులు బోలెడు జోడించారు. కథను ట్విస్ట్ చేసి చెప్పడం వల్ల క్లారిటీ లోపించింది. భారీ రేంజ్ లో ఖర్చు పెట్టేయడంతో సాహో బడ్జెట్ పరిమితులు దాటిపోయింది. ఫలితంగా బాహుబలి క్రేజ్ ను సరిగ్గా వినియోగించుకోవడంలో సాహో ఫెయిల్ అయింది. ఈ చిత్రం ఒక్క నార్త్ లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా దారుణంగా విఫలమైంది. తెలుగు వారు సాహోను పూర్తిగా తిప్పికొట్టారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ప్రభాస్ 20వ చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. ప్రభాస్ నటిస్తోన్న 20వ చిత్రానికి జాన్ అనే టైటిల్ ను అనుకుంటున్న విషయం తెల్సిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటివరకూ యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. సాహో ఫలితంతో అప్రమత్తమైన జాన్ మేకర్స్.. ఈ చిత్ర స్క్రిప్ట్ ను మళ్ళీ సమీక్షించారు. అనవసర హంగుల జోడించకూడదని నిర్ణయించుకున్నారు. బడ్జెట్ కూడా కుదించుకుందామని ఫిక్స్ అయ్యారు. దీని ప్రకారం ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా మారిపోయింది. స్క్రిప్ట్, మూవీ మేకింగ్ విషయంలో మార్పులు, కరెక్షన్స్ అన్నీ జరిగాయని భావించిన తర్వాత కొత్తగా షెడ్యూల్స్ వేసుకుని నవంబర్ నుండి మళ్లీ షూటింగ్ కు వెళ్లనున్నారు. విరామం తర్వాత తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఇప్పటికే నిర్మించిన భారీ సెట్ లో జాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కూడా మూడు భాషల్లో విడుదలవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట భావించారు. అయితే ఇప్పడున్న పరిస్థితుల్లో అది జరగని పనిగా తెలుస్తోంది. వచ్చే దసరాకి విడుదల కావొచ్చని అంటున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts