Homeటాప్ స్టోరీస్తమిళ్ లో నటించాలని ఆశపడుతున్న ప్రభాస్

తమిళ్ లో నటించాలని ఆశపడుతున్న ప్రభాస్

Prabhas
Prabhas

నేను పుట్టి పెరిగింది చెన్నై లోనే దాంతో చెన్నైతో నాకు తిరుగులేని అనుబంధం ఉంది దాంతో నేరుగా తమిళ సినిమాలో నటించాలని నాకు ఎప్పటి నుండో ఉంది , నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా తమిళ సినిమా కోసం అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . సాహో ఆగస్టు 30 న విడుదల అవుతున్న నేపథ్యంలో నిన్న చెన్నై లో సాహో టీమ్ మీడియాతో సమావేశమైంది .

ఆ సందర్బంగా మాట్లాడిన ప్రభాస్ తన మనసు లోని మాటని వెల్లడించాడు . సాహో చిత్రాన్ని కూడా తమిళ్ లో చిత్రీకరించారు కానీ ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమా కాబట్టి నేరుగా తమిళంలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్ . తమిళ మీడియా ముందు ఓపెన్ అయ్యాడు కాబట్టి కొంతమంది దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేయాలనే ఆలోచన చేయడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All