Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించే గోల్డెన్ ఛాన్స్!

ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించే గోల్డెన్ ఛాన్స్!

ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించే గోల్డెన్ ఛాన్స్!
ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించే గోల్డెన్ ఛాన్స్!

ప్ర‌భాస్ హీరోగా `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ `స‌లార్‌` రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ మేక‌ర్స్ హోంబ‌లే ఫిల్మ్స్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మించ‌నున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ఫ‌స్ట్ టైటిల్ పోస్ట‌ర్‌కు ఆడియ‌న్స్ నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.  జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో `స‌లార్‌` మేక‌ర్స్ బుధ‌వారం ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ మూవీలో న‌టించే గోల్డెన్ ఛాన్స్‌ని అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఏజ్ లిమిట్ అనేది లేకుండా అన్ని ర‌కాల వ్య‌క్తులు ఈ నెల 15న హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగు ఆడిష‌న్‌లో పాల్గొనాల‌ని ప్ర‌క‌టించింది. ఇందు కోసం ఎనీ ల్యాంగ్వేజ్ వ‌న్ మినిట్ వీడియోని పంపించాల‌ని తెలిపింది. ఈ నెల 15న ఆడిష‌న్స్ ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంద‌ట‌.

- Advertisement -

ఇక్క‌డ పూర్త‌యిన త‌రువాత బెంగ‌ళూరు, చెన్నైల‌లోనూ ఇదే త‌ర‌హా ఆడిష‌న్స్‌ని నిర్వ‌హించ‌నున్నార‌ట‌. `స‌లార్‌` టీమ్ ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం క‌ల్పిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ని ఎంత మంది ద‌క్కించుకుంటారో చూడాలి. ప్ర‌భాస్ ఇందులో క‌రుడు గ‌ట్టిన డాన్‌గా క‌నిపించ‌బోతున్నారు. లుక్ ప‌రంగా ప్ర‌భాస్ ఇందులో స‌రికొత్త‌గా క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All