Homeటాప్ స్టోరీస్ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటో తెలుసా

ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటో తెలుసా

 Prabhas role revealed in Radhakrishna's film గోపీచంద్ హీరోగా నటించిన జిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ కు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే . జిల్ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు అయినప్పటికీ అతడి పై నమ్మకంతో సినిమా ఇచ్చాడు ప్రభాస్ . బాహుబలి తర్వాత ఊహించని రీతిలో స్టార్ డం వచ్చిన హీరో డేట్స్ ఇవ్వడంతో ప్రభాస్ కోసం మూడేళ్ళ పాటు వెయిటింగ్ లో ఉన్నాడు రాధాకృష్ణ . మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ పూర్తయ్యింది . సినిమా ఓపెనింగ్ అయ్యింది , షూటింగ్ కూడా జరుగుతోంది .

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రని పోషిస్తున్నాడో తెలుసా …… వింటేజ్ కార్ల వ్యాపారి పాత్రలో నటించనున్నాడు ప్రభాస్ . యూరప్ నేపథ్యంలో తెరెక్కుతున్న ఈ చిత్రంలో వింటేజ్ కార్ల ని అమ్ముతుంటాడట ప్రభాస్ , అయితే అలా కార్లు అమ్ముతున్న సమయంలో ఓ కారు వల్ల అనూహ్య సంఘటనలు జరుగుతాయట . అలాగే ఆ కారు వాళ్ళ సమస్యల్లో ఇరుక్కుంటాడట . ప్రభాస్ కు ఎదురైన సమస్య ఏంటి ? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇక ఇది నిజమా ? లేదా ? అన్నది సినిమా విడుదల అయితే కానీ తెలీదు . ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది .

- Advertisement -

English Title:  Prabhas role revealed in Radhakrishna’s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All