Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కు ఆ ప్రశ్న వేస్తే అసలు చిరాకు కలుగదట

ప్రభాస్ కు ఆ ప్రశ్న వేస్తే అసలు చిరాకు కలుగదట

prabhas-responds-about-his-wedding
prabhas-responds-about-his-wedding

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉండిపోతున్నాడు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో..అనుకుంటూ అభిమానులు ఏళ్లు గడుపుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు. ప్రభాస్ ఎక్కడ కనిపించిన సరే మీడియా వారు మొదటగా అడిగే ప్రశ్న పెళ్లి గురించే..మీడియా వారు అడగడం..ప్రభాస్ దాటివేయడం కామన్ గా మారింది.

తాజాగా మరో సారి ప్రభాస్ కు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. ‘ప్రభాస్‌ మీ పెళ్లెప్పుడు?’అంటూ ఓ ఇంటర్వ్యూలో అడగగా ఎప్పటిలాగే చిలిపి సమాధానంతో దాటవేశాడు. ‘దానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నాకు తెలిసినప్పుడు అందరికీ చెప్తాను’అంటూ నవ్వేశాడు. ‘ఎక్కడకు వెళ్లినా మీ పెళ్లి గురించే అడుగుతుంటారు. అది మీకు చిరాకు తెప్పించదా?’అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ.. ‘లేదు నాకెప్పుడూ చిరాకు అనిపించదు. నేను అర్థం చేసుకోగలను వారు నా గురించి ఎంతలా ఆలోచిస్తారో అని.. అయినా అలా అడగడం సాధారణ విషయమే. వారి స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తా’అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All