
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలని వన్ బై వన్ అంగీకరిస్తూ వరుస షాకులిస్తున్నారు. `సాహో` తరువాత ప్రభాస్ `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణా మూవీస్ సమర్పణలో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
పిరియాడిక్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా వుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ చిత్రంలో ప్రభాస్‌కు మదర్‌గా కనిపించబోతున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే కీలక ఘట్టాలని మాత్రం ఇంకా పూర్తి చేయాల్సి వుంది. ఈ లోగా కరోనా ప్రబలడంతో షూటింగ్‌ని తాత్కాలికంగా ఆపేసిన విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండు భారీ చిత్రాల్ని అంగీకరించిన ప్రభాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని అక్టోబర్ నుంచి మొదలుపెట్టి వీలైనంత స్పీడుగా పూర్తి చేయాలని పక్కాగా నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అక్టోబర్ మిడ్‌లో షూటింగ్ ని పునః ప్రారంభించాలని చిత్ర బృందం కూడా ప్లాన్ చేస్తోందట.