Homeటాప్ స్టోరీస్సలార్, ఆది పురుష్ షూటింగులను హోల్డ్ లో పెట్టిన ప్రభాస్

సలార్, ఆది పురుష్ షూటింగులను హోల్డ్ లో పెట్టిన ప్రభాస్

సలార్, ఆది పురుష్ షూటింగులను హోల్డ్ లో పెట్టిన ప్రభాస్
సలార్, ఆది పురుష్ షూటింగులను హోల్డ్ లో పెట్టిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ బజ్ ఉన్న హీరో. ప్రస్తుతం, ఆ తర్వాత ప్రభాస్ నుండి వచ్చే సినిమాలు అన్నీ కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే.  రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ చిత్రాలు షూటింగ్ లో ఉండగా, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ సలార్, ఆది పురుష్ షూటింగ్స్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా రాధే శ్యామ్ మీదే ఉందని అది పూర్తయ్యాకే వేరే సినిమాలు చేస్తానని ప్రభాస్ స్పష్టం చేసాడట. ఇప్పటికే రాధే శ్యామ్ సెట్స్ కు వెళ్లి రెండేళ్లు దాటిపోతోంది.

- Advertisement -

రీసెంట్ గా రాధే శ్యామ్ ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. వీలైనంత తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All