
రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..ఈ మూవీ రిజల్ట్ తో బాగా డిస్పాయింట్ అయ్యాడు. ఈ మూవీ సక్సెస్ అయితే వెంటనే.. మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయాలనీ అనుకున్నాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిలో మాళవిక మోహన్ , కృతి శెట్టిలను ఎంపిక అయ్యారని కూడా అన్నారు.
కానీ రాధే శ్యామ్ మూవీ ప్లాప్ కావడం తో మారుతీ మూవీ ని పక్కకు పెట్టినట్లు వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మారుతీ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మారుతి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. పక్కా కమర్షియల్ సినిమా విడుదల అయిన వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న సినిమా విడుదల కూడా మరీ ఆలస్యం కాకుండా ఇదే ఏడాది చివర్లో ఉంటుందని అంటున్నారు. రెండు నెలల్లోనే చిత్రీకరించినా కూడా మరీ లో బడ్జెట్ తో కాకుండా భారీగానే ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.