Homeటాప్ స్టోరీస్నేటితో నా కల నేరవేరిందంటూ ప్రభాస్ ఫుల్ హ్యాపీ ..

నేటితో నా కల నేరవేరిందంటూ ప్రభాస్ ఫుల్ హ్యాపీ ..

నేటితో నా కల నేరవేరిందంటూ ప్రభాస్ ఫుల్ హ్యాపీ ..
నేటితో నా కల నేరవేరిందంటూ ప్రభాస్ ఫుల్ హ్యాపీ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ మూవీస్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరికొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా రాధే శ్యామ్ మూవీ ని పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేసిన డార్లింగ్..ఆదిపురుష్ , సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే మూవీస్ ను సెట్స్ ఫై ఉంచాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ సెట్స్ లో లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను సైతం జాయిన్ అయ్యారు. ప్రభాస్ , బిగ్ బి కలయికలో కొన్ని సన్నివేశాలు షూట్ చేసారు.

ఈ క్రమంలో ప్రభాస్ నా కల నేరవేరిందంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. “నేటితో నాకు ఒక కల నిజమైంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్ తో ఈరోజు # ప్రాజెక్ట్ మొదటి షాట్ ను పూర్తి చేసాను“ అంటూ ప్రభాస్ ఆనందం వ్యక్తం చేసారు.

- Advertisement -

1975 నాటి `దీవార్` చిత్రం నుండి అమితాబ్ లుక్ ని కూడా ప్రభాస్ షేర్ చేసారు. అలాగే బిగ్ బి సైతం “బాహుబలి ప్రభాస్ తో మొదటి రోజు మొదటి షాట్.. పూర్తయింది. సూపర్ స్టార్ ప్రభాస్ నమ్రతతో పాటు అతని నటన సౌరభం చూసాను. నేర్చుకనేందుకు చాలా ఉంది!“ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ట్వీట్స్ చేసుకోవడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All