Homeటాప్ స్టోరీస్తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా?

తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా?

తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా?
తెలుగు పండక్కి ప్రభాస్.. కన్ఫర్మ్ఏనా?

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలకే కమిటైన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే యాక్షన్ థ్రిల్లర్ సాహో చేసినా అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం హిందీ భాషలో బాగా ఆడిన ఈ సినిమా మిగతా భాషల్లో ఫెయిలైంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో ప్రభాస్ అత్యంత కేర్ తీసుకుని చేస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమా జిల్ సినిమాతో విజయాన్ని అందుకున్న రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కాకుండా తర్వాత స్క్రిప్ట్ దగ్గరనుండి అన్నీ సమీక్షించి మళ్లీ అన్నీ సెట్ అనుకున్నాకే షూటింగ్ మొదలుపెట్టారు. అసలు ఈ సినిమా షూటింగ్ గతేడాదే మొదలుకావాల్సి ఉన్నా పైన చెప్పిన కారణాల వల్ల ఆలస్యమై గత నెలలో మొదలైంది. అప్పటినుండి షూటింగ్ హైదరాబాద్ లోని వివిధ సెట్స్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన లేక్ సెట్ లో ప్రభాస్, పూజలపై బోట్ సీన్స్ లు చిత్రీకరిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తై, ఆ తర్వాత ట్రైన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేయబోతున్నారు.

- Advertisement -

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తెలుగు పండగ ఉగాది సందర్భంగా విడుదల కానుందని ఒక ప్రచారం మొదలైంది. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందన్నది చూస్తే.. అది జస్ట్ రూమరేమో అన్న ఫీలింగ్ రావడం ఖాయం. ఎందుకంటే ఈ చిత్రానికి పూర్తైన షూటింగ్ చాలా తక్కువ. కేవలం మూడు చిన్న చిన్న షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి వరకూ ఈ సినిమా షూటింగ్ కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఫస్ట్ లుక్ అంటే కష్టమే. చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశమైతే ఉంది. మరి చూడాలి ఇందులో ఎంత వరకూ నిజముందో. ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధేశ్యామ్ అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All