Homeటాప్ స్టోరీస్బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ప్ర‌భాస్ ఫామ్ హౌస్‌!

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ప్ర‌భాస్ ఫామ్ హౌస్‌!

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ప్ర‌భాస్ ఫామ్ హౌస్‌!
బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ప్ర‌భాస్ ఫామ్ హౌస్‌!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. ఆయ‌న సినిమా వ‌స్తోందంటే.. ఆయ‌న నుంచి ఏదైనా ప్ర‌క‌ట‌న రాబోతోందంటే దేశ వ్య‌ప్తంగా చ‌ర్చ మొద‌లౌతోంది. అంతా లా ప్ర‌భాస్ `బాహుబ‌లి` త‌రువాత దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అత‌ని మార్కెట్ స్థాయి పెరిగిపోవ‌డం.. పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తుండ‌టంతో ప్ర‌భాస్ ప్ర‌తి క‌ద‌లిక దేశ వ్యాప్తంగా అటెన్ష‌న్ ని క్రియేట్ చేస్తోంది.

ప్ర‌స్తుతం మూడు పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌భాస్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అదీ ఆయ‌న ఫామ్ హౌస్ కార‌ణంగా. గ‌చ్చిబౌలి శివారులో ప్ర‌భాస్‌కు ఓ ఫామ్ హౌస్ వున్న విష‌యం తెలిసిందే. దీనిపై అప్ప‌ట్లో అక్క‌మ క‌ట్ట‌డ‌మ‌ని పెద్ద దుమార‌మే రేగింది. దీనిపై ప్ర‌భాస్ రాష్ట్ర హైకోర్టుని కూడా ఆశ్ర‌యించ‌డంతో వివాదం స‌మ‌సిపోయింది. తాజాగా మ‌ళ్లీ ప్ర‌భాస్ ఫామ్ హౌస్ వార్త‌ల్లో నిలుస్తోంది.

- Advertisement -

ప్ర‌భాస్ ఫామ్ హౌస్ విలువ దాదాపు 60 కోట్ల‌ని. ఇందులో స‌క‌ల స‌దుపాయాల‌తో పాటు ఫామింగ్ కూడా చేస్తుంటార‌ని.. ఇంత‌టి ల‌గ్జ‌రీ ఫామ్ హౌస్ సౌత్ లోనే అత్యంత ఖ‌రీదైన‌ద‌ని బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ‌న‌డుస్తోంది. దీనికి సంబంధించిన ఓ బాలీవుడ్ మీడియా ఆస‌క్త‌క‌ర‌మైన క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డంతో ప్ర‌భాస్ ఫామ్ హౌస్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All