Homeగాసిప్స్రాధే శ్యామ్ అభిమానుల అంచనాలు అందుకుందా..?

రాధే శ్యామ్ అభిమానుల అంచనాలు అందుకుందా..?

prabhas fans disappointing
prabhas fans disappointing

గత మూడేళ్లుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమ , సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులైతే వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కడం..విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం..అందమైన లొకేషన్స్ ..సక్సెస్ ఫుల్ బ్యూటీ పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం..వరుస మ్యూజికల్ హిట్స్ కొడుతున్న థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం..ఇవన్నీ కూడా రాధే శ్యామ్ ఫై అంచనాలు పెంచాయి. కానీ అభిమానుల అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనేది వాస్తవం.

బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి భారీగా పెరిగింది. ప్రభాస్ సినిమా అంటే బాహుబలి స్థాయిలో అంతకంటే ఎక్కువగా పెట్టుకుంటున్నారు తప్ప తక్కువగా మాత్రం పెట్టుకోవడం లేదు. ప్రభాస్ నుండి ఓ సినిమా వస్తుందంటే దానిపై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకుంటున్నారు. మా హీరో ఆలా ఉండాలి..కథ ఓ రేంజ్ లో ఉండాలి..ఫైట్స్ చించేయాలి..డైలాగ్స్ అదరగొట్టాలి..డాన్స్ లు కుమ్మేయాలి ఇలా ఎన్నో అనుకోని థియేటర్లోకి పరుగులు పెట్టారు. హీరో ఎంట్రీ ఇవ్వగానే పేపర్లు చించేసి స్వాగతం పలికారు. కానీ ఆ తర్వాత మెల్ల మెల్లగా నిరాశ పడుతూ కూర్చున్నారు.

- Advertisement -

ఛత్రపతి , మిర్చి , బాహుబలి వంటి మాస్ చిత్రాల్లో ప్రభాస్ ను చూసి..ఒకేసారి క్లాస్ గా చూసేసరికి తట్టుకోలేకపోతున్నారు. ప్రభాస్ సినిమా అంటే ఓ రేంజ్ ఫైట్స్ , డాన్స్ , డైలాగ్స్ ఇలా ఎన్నో అనుకోని వచ్చారు. కానీ అవేమి కూడా రాధే శ్యామ్ లో లేకపోయేసరికి లోలోపల బాధపడుతున్నారు. బయటకు బాగుందని చెపుతున్న..వారి అంచనాలకు మాత్రం అందుకోలేకపోయిందనేది వాస్తవం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All