Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందని అభిమాని ఆత్మహత్య

రాధే శ్యామ్ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందని అభిమాని ఆత్మహత్య

radhe shyam first review
radhe shyam first review

హీరోలఫై అభిమానం పెంచుకోవడంలో తప్పులేదు…కానీ ప్రాణాలు తీసుకునేంతగా అభిమానం పెంచుకుంటే అది అభిమానం అనిపించుకోదు..పిచ్చితనం అనిపించుకుంటుంది. తాజాగా రాధే శ్యామ్ మూవీ కి ప్లాప్ టాక్ వచ్చిందని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూల్ లో చోటుచేసుకుంది.

ప్రభాస్ – రాధాకృష్ణ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్..శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. పూర్తీ గా క్లాస్ మూవీ కావడం , ప్రభాస్ క్లాస్ గా కనిపించడం , సినిమా కు స్లో గా సాగడం వల్ల చాలామందికి నచ్చలేదు. దీంతో సినిమా కు మొదటి రోజు మొదటి షో తోనే మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో కర్రనోల్ కు చెందిన రవితేజ అనే కుర్రాడు..సినిమాకు ప్లాప్ టాక్ రావడం తో జీర్ణించుకోలేకపోయాడు. తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని బాధతో ఆత్మ హత్య చేసుకున్నాడు.

- Advertisement -

రవితేజ అలా ఆత్మహత్య చేసుకోవడంతో లాభం ఏమిటి అని ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి అని తోటివారు అభిప్రాయపడుతున్నారు. అభిమానం అనేది మంచిదే కానీ దాన్ని ప్రాణం మీదకు తెచ్చుకున్న అంత అభిమానం పెంచుకోవడం కూడా సరైనది కాదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రైల్వే కొడూరు థియేటర్ ముందు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటు ఉండగా అపశ్రుతి నెలకొంది. ఒక బస్సు స్కూటర్ ను డీ కొట్టడంతో అభిమాని తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. మరో చోట రాధే శ్యామ్ థియేటర్ వద్ద ప్రబస్ కట్ ఔట్స్ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ అభిమాని మృతి చెందాడు. ఇలా ముగ్గురు అభిమానులు చనిపోవడం వారి వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All