Homeటాప్ స్టోరీస్ఆ వార్తలను ఖండించిన ప్రభాస్

ఆ వార్తలను ఖండించిన ప్రభాస్

prabhas denied rumours on karan joharబాహుబలి తో ప్రభాస్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయ్యింది , దాంతో కరణ్ జోహార్ ప్రభాస్ తో బాలీవుడ్ లో సినిమా చేయాలనీ భావించినట్లు అయితే రెమ్యునరేషన్ దగ్గర ఇద్దరికీ తేడా కొట్టడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు పోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . అయితే మరోసారి బాహుబలి 2 తో చరిత్ర సృష్టించాడు దాంతో మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట కరణ్ జోహార్ అయితే మొదటిసారి రెమ్యునరేషన్ దగ్గర పేచీ రాగా ఇక రెండోసారి ప్రభాస్ కరణ్ తో సినిమా చేయడం ఇష్టం లేక డేట్స్ ఖాళీ లేవు అని మొహం మీదే చెప్పినట్లు అందుకు ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు కారణం అంటూ బాలీవుడ్ లో సైతం వార్తలు వచ్చాయట .

ఇంకేముంది ఆ వార్తలు ఎలా ఉన్నాయో చూడు అంటూ ప్రభాస్ కు పంపించాడట కరణ్ జోహార్ దాంతో దుబాయ్ లో ఉన్న ప్రభాస్ కరణ్ జోహార్ తో నాకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేసాడు . అవన్నీ గాలి వార్తలే అని ఖండించాడు . వార్తలైతే ఖండించాడు కానీ నిజంగానే ప్రభాస్ కు కరణ్ జోహార్ కు బేధాభిప్రాయాలు అయితే ఉన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts