
మొత్తానికి ప్రభాస్ ‘లవ్ మ్యారెజ్ చేసుకుంటాను’ అని తేల్చేసాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో..అనుకుంటూ అభిమానులు ఏళ్లు గడుపుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు. తాజాగా రాధే శ్యామ్ ప్రమోషన్ లలో మీడియా వారు పదేపదే పెళ్లి గురించి అడగడం తో నోరువిప్పక తప్పలేదు.
ప్రభాస్ మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా తర్వాత దాదాపు 5 వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి.. ఆ పెళ్లి రిక్వెస్ట్స్ అన్ని నాకు పెద్ద కన్య్ఫూజన్ అయ్యాయి. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. కానీ ఎప్పుడనేది తెలియదు. మా అమ్మ నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. మా ఇంట్లో నా పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను బాహుబలి తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని మాటిచ్చాను.. నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.