Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కి బాలీవుడ్ ఇన్విటేషన్.. బిగ్ ప్రాజెక్ట్?

ప్రభాస్ కి బాలీవుడ్ ఇన్విటేషన్.. బిగ్ ప్రాజెక్ట్?

Prabhas bollywood movie details

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో షాక్ నుంచి తొందరగానే బయటపడ్డాడు. బాలీవుడ్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందడంతో ఆ విధంగా  సినిమా రిజల్ట్ కాస్త ఆనందాన్ని ఇచ్చింది. ఇక మొన్నటివరకు 40వ బర్త్ డేను సాలీడ్ గా సెలబ్రేట్ చేసుకున్న ఈ బాహుబలి స్టార్ నెక్స్ట్ జాన్ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే ప్రభాస్ జాన్ సినిమా చేస్తూనే.. మరో సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా స్టార్ దర్శకుల నుంచి వచ్చిన కథలను వింటున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. దిల్ రాజు ఈ కాంబోని సెట్స్ పైకి తెనున్నట్లు సమాచారం. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే.. నెక్స్ట్ బాలీవుడ్ వైపు కూడా ప్రభాస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ ని ప్రత్యేకంగా కలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. గతంలోనే ఒక కథపై డిస్కస్ చేసినప్పటికీ ప్రభాస్ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ కి కరణ్ నుంచి ఓ స్పెషల్ ఇన్విటేషన్స్ అందినట్లు సమాచారం. మరో స్క్రిప్ట్ వినిపించేందుకు కరణ్ జోహార్ ఓ డైరెక్టర్ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మించాలని చేసుకుంటున్న ప్లాన్స్ పై ప్రభాస్ పాజిటివ్ గానే ఉన్నాడట. అన్ని కుదిరితే ఇదే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి డార్లింగ్ కరణ్ ప్రాజెక్ట్ కి ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All