
హీరో – హీరోయిన్లు ఒక సినిమా లో నటించారంటే ఇద్దరి మధ్య చాల స్నేహం పెరుగుతుంది..దాదాపు మూడేళ్ళ పాటు ఒకే సినిమా కోసం పనిచేస్తే వారి స్నేహం పిక్ లెవల్లో ఉంటుంది. కానీ మన డార్లింగ్ విషయంలో ఆలా జరగలేదు. రాధే శ్యామ్ కోసం పూజా తో దాదాపు మూడేళ్లు పనిచేసిన ఇద్దరి మధ్య కాస్త కూడా స్నేహం చిగురించలేదని తాజాగా బయటపడింది.
రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మార్చి 11 న పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో హీరో , హీరోయిన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. నిన్న ముంబై లో చిత్ర ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేసారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. కానీ వీరిద్దరూ మాత్రం ఒకే వేదికపై ఉన్నా ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కానీ ఆలింగనం చేసుకోలేదు. అంతెందుకు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదట. వీరిద్దరి ప్రవర్తన మీడియా వారికీ పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటి హీరో , హీరోయిన్లు అన్నప్పుడు దగ్గరిగా కూర్చుని మాట్లాడుకోవడం, పలకరించుకోవడం , చూసుకోవడం వంటివి చేస్తారు..వీరిద్దరూ ఏంటి ఇలా ఉన్నారని మాట్లాడుకున్నారట.
మొదటి నుండి కూడా `రాధేశ్యామ్` టీమ్ తో పూజా సరిగా లేదనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. పూజా హెగ్డే ఇచ్చిన డేట్లలో యూనిట్ షూటింగ్ చేయకపోవడంతో..ఆ తర్వాత ఆమె అదనంగా డేట్లు కేటాయించకపోవడంతో పూజాహెగ్డేఫై యూనిట్ కాస్త సీరియస్ అయ్యారట. ఈ విషయంలో ప్రభాస్ కూడా పూజా ఫై సీరియస్ గానే ఉన్నాడట. అందుకే వేదికపై పూజా తో ఆలా ఉన్నాడని అంత అంటున్నారు.