
గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` కోసమే ఆయన ముంబైలో వుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ పాల్గొనగా కొన్ని కీలకమైన సోలో సన్నివేశాలని షూట్ చేస్తున్నారట. పెద్ద కాన్వాస్‌పై 3 డి పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది.
ఇందులో ప్రభాస్‌కు జోడీగా సీత పాత్ర పోషించడానికి మేకర్స్ కృతి సనన్ ని ఫైనల్ చేసి ఆ వియాన్ని ఈ శుక్రవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌కు సోదరుడిగా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఈ రోజే సన్నీ సింగ్, కృతిసనన్ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రత్యేకమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో మేకర్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావన్ పాత్రలో కనిపించనున్నారు.