
బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో చిత్ర బయ్యర్లు భారీగా నష్టపోయారు. కాగా ఈ మూవీ ఫలితం ఫై ఫస్ట్ టైం ప్రభాస్ నోరు విప్పారు.
తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. రాధేశ్యామ్ పై మాట్లాడుతూ.. ‘మాస్ ఇమేజ్ ఉన్న నన్ను ప్రేమ కథల్లో ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు లేదా స్క్రిప్ట్ లో లోపం ఉండవచ్చు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. పైగా రిలీజ్ టైమ్కి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే సినిమాకు మరింత మైనస్’ అని చెప్పుకొచ్చారు. అయితే బిగ్ స్క్రీన్ పై అలరించకపోయినా టెలివిజన్ స్క్రీన్పై చూసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ రాధే శ్యామ్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారని ప్రభాస్ పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడీయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.