తమిళస్టార్ హీరో విజయ్ తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది . అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ప్రకటించారు అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు . ఇంతకీ విజయ్ – మురుగదాస్ ల సినిమా టైటిల్ ఏంటో తెలుసా …… ” సర్కార్ ” . పవర్ ఫుల్ టైటిల్ ని ప్రకటించడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది తమిళనాట .
ఇంతకుముందు విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో ” తుపాకి ” , ” కత్తి ” చిత్రాలు వచ్చాయి . రెండు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి . ఇక కత్తి సినిమా అయితే ఏకంగా చిరంజీవి 150 వ చిత్రంగా రీమేక్ అయి సంచలనం సృష్టించింది . రెండు హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ ” సర్కార్ ” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . పైగా విజయ్ కిది 62 వ చిత్రం కావడం విశేషం . విజయ్ గెటప్ కు పవర్ ఫుల్ టైటిల్ తోడవ్వడంతో విజయ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు . ఇక ఈ సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది ఎందుకంటే విజయ్ కి అలాగే మురుగదాస్ కు కూడా క్రేజ్ ఉంది కాబట్టి .
#Sarkar pic.twitter.com/czi9c9zoQ1
— Vijay (@actorvijay) June 21, 2018