Homeటాప్ స్టోరీస్మొత్తానికి ట్విట్ట‌ర్ మోతెక్కించారుగా!

మొత్తానికి ట్విట్ట‌ర్ మోతెక్కించారుగా!

మొత్తానికి ట్విట్ట‌ర్ మోతెక్కించారుగా!
మొత్తానికి ట్విట్ట‌ర్ మోతెక్కించారుగా!

క‌రోనా కార‌ణంగా ఈ మ‌ధ్య పుట్టిన రోజు హంగామాల‌న్నీ సోష‌ల్ మీడియా వేదిక‌గానే జ‌రుగుతున్నాయి.  గ‌తంలో స్టార్స్ బ‌ర్త్‌డే లంటే గుంపులు గుపులుగా ఫ్యాన్స్ పాల్గొని చేసే హంగామా వేరుగా వుండేది.కేక్ క‌టింగ్‌లు, వీధుల్లో, థీయేట‌ర్ల ముందు ప‌టాకుల మోత అబ్బో ఆ ర‌చ్చే వేరు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఫ్యాన్స్ హంగామా అంతా సోష‌ల్ మీడియాకు చేరింది. ఇక స్టార్ హీరోల పుట్టిన రోజు వ‌చ్చేస్తోందంటే దాదాపు నెల రోజుల‌కు ముందు నుంచే  సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ర‌చ్చ మొద‌ల‌వుతోంది.

మ‌హేష్ పుట్టిన రోజున ఫ్యాన్స్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ట్విట్ట‌ర్‌లో ఫ్యాన్స్ ర‌చ్చ ట్రెండింగ్‌గా మారి రికార్డు నెల‌కొల్సింది. కేవ‌లం 24 గంట‌ల్లో 60 మిలియ‌న్‌ల ట్వీట్‌లతో ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. ఆ రికార్డుపై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ క‌న్నేశారు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో #PawanKalyanBirthdayCDPపై చ‌ర్చ న‌డుస్తోంది. మ‌హేష్ ఫ్యాన్స్ నెల‌కొల్పిన రికార్డుని ప‌వ‌న్ ఫ్యాన్స్ కేవ‌లం 24 గంట‌ల్లోనే అధిగ‌మించ‌డం వ‌ర‌ల్డ్ రికార్డుగా చెబుతున్నారు.

- Advertisement -

ప‌వ‌న్ బ‌ర్త్ డే కామ‌న్ సీడీపీ హ్యా్ ట్యాగ్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ అత్య‌ధిక ట్వీట్ల ట్రెండ్‌ను ప‌వ‌న్ పేరిట న‌మోదు చేశారు. కేవ‌లం 24 గంట‌ల్లోనే 65 మిలియ‌న్ల పైచిలుకు ట్వీట్‌లు చేయ‌డంతో ఈ స‌రికొత్త రికార్డు సాధ్య‌మైంది. ప‌వ‌న్ బ‌ర్త్‌డే కామ‌న్ డీపీ కోస‌మే ఫ్యాన్స్ ఇంత హంగామా చేస్తే పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 2న ఎంత ర‌చ్చ చేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All