Homeటాప్ స్టోరీస్పోస్ట‌ర్ టాక్: చుల్‌బుల్ పాండే సిక్స్ ప్యాక్ హంగామా!

పోస్ట‌ర్ టాక్: చుల్‌బుల్ పాండే సిక్స్ ప్యాక్ హంగామా!

పోస్ట‌ర్ టాక్: చుల్‌బుల్ పాండే సిక్స్ ప్యాక్ హంగామా!
పోస్ట‌ర్ టాక్: చుల్‌బుల్ పాండే సిక్స్ ప్యాక్ హంగామా!

బాలీవుడ్ బాడీ బిల్డ‌ర్ స‌ల్మాన్‌ఖాన్ మ‌రోసారి చుల్‌బుల్ పాండేగా హంగామా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. స‌ల్మాన్ న‌టిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ `ద‌బాంగ్‌-3`. `దాబంగ్‌` ఫ్రాంచైజీలో భాగంగా మూడ‌వ సీక్వెట్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని డ్యాన్సింగ్ సెన్సేష‌న్ ప్ర‌భుదేవా రూపొందిస్తున్నారు. స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తూ త‌మ్ముడు అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ దివ్వేదితో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌ల్మాన్‌ఖాన్‌కు ఊద్ సెంటిమెంట్ వున్న విష‌యం తెలిసిందే. ఆ సెంటిమెంట్ తో డిసెంబ‌ర్‌లో రిలీజైన `ద‌బాంగ్‌` సిరీస్‌ల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌లుగా నిలిచాయి.

అదే సెంటిమెంట్ `ద‌బాంగ్‌-3` విష‌యంలోనూ రిపీట్ అవుతుంద‌ని స‌ల్మాన్‌ఖాన్ బ‌లంగా న‌మ్ముతున్నాడు. అందుకే ఈ సీక్వెల్‌ని ఈ నెల 20న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే సినిమా కూడా వుండే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. క‌న్న‌డ హీరో సుదీప్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమా మ‌రో ప‌ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలోని స‌ల్మాన్‌ఖాన్ పోస్ట‌ర్ ని ఈ సినిమా ద్వారా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌హేష్ మంజ్రేక‌ర్ కూతురు సాయి మంజ్రేక‌ర్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది.

- Advertisement -

`మ‌రో ప‌ది రోజుల్లో ఈ శ‌తాబ్ద‌పు బిగ్గెస్ట్‌, బ్యాడెస్ట్ ఫైట్‌ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అని ట్వీట్ చేసి 1ఏ డేస్ టు ద‌బాంగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ష‌ర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో వున్న స‌ల్మాన్‌ఖాన్ లుక్ ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సినిమాలోని క్లైమాక్స్ స‌న్నివేశంలో స‌ల్మాన్‌ఖాన్ ష‌ర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపిస్తాడ‌ని, ఈ స‌న్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర బృందం చెబుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All