Homeటాప్ స్టోరీస్అభిమన్యుడు హిట్ మరి ఆ రెండు సినిమాల సంగతేంటో

అభిమన్యుడు హిట్ మరి ఆ రెండు సినిమాల సంగతేంటో

possitive reports on vishal abhimanyudu విశాల్ హీరోగా నటించిన ” అభిమన్యుడు ” చిత్రానికి తెలుగునాట పాజిటివ్ టాక్ వచ్చింది . అసలు తమిళంలో ఈ చిత్రం మేలో విడుదలై విశాల్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది . అక్కడ భారీ వసూళ్ల ని సాధిస్తోంది ”ఇరుంబుతిరై ”. ఇక తెలుగునాట ఈ చిత్రాన్ని ” అభిమన్యుడు ” గా అనువాదం చేసారు . ఈరోజు మూడు చిత్రాలు విడుదల అయ్యాయి , నాగార్జున నటించిన ” ఆఫీసర్ ” , రాజ్ తరుణ్ నటించిన ” రాజుగాడు ” . నాగార్జున చిత్రం పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి వర్మ దర్శకుడు కాబట్టి .

ఇక రాజుగాడు చిత్రం పరిస్థితి కూడా అంతే . గతకొంత కాలంగా రాజ్ తరుణ్ సినిమాలకు కూడా గిరాకీ లేకుండా పోయింది వరుస పరాజయాలతో . విశాల్ చిత్రాలు కూడా తెలుగులో ఈమధ్య హిట్ కాలేదు కానీ తమిళంలో ఇరుంబు తిరై ఘనవిజయం సాధించడంతో అభిమన్యుడు పై అంచనాలు పెరిగాయి . డిజిటల్ ఇండియా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కి , కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్రం రూపొందడంతో వివాదాస్పదం అయ్యింది . అయితే ఈ సినిమాని ముందుగానే స్క్రీనింగ్ చేయడంతో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి . ఇక ఆఫీసర్ , రాజుగాడు చిత్రాల పరిస్థితి ఏంటో కొద్ది గంటల్లో తేలిపోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All