Homeటాప్ స్టోరీస్ఈ నగరానికి ఏమైంది చిత్రానికి పాజిటివ్ టాక్

ఈ నగరానికి ఏమైంది చిత్రానికి పాజిటివ్ టాక్

positive talk to tarun bhaskar ee nagaraniki emaindiపెళ్లి చూపులు వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఇక ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . పెళ్లి చూపులు చిత్రం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం , ఇటీవల విడుదలైన ట్రైలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో ఈ నగరానికి ఏమైంది చిత్రంపై అప్పుడే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది .

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సురేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు . అలాగే తరుణ్ భాస్కర్ అయితే తప్పకుండా పెద్ద హిట్ కొట్టబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు . ఇప్పుడున్న యువత ఆలోచనా విధానంతో ఈ నగరానికి ఏమైంది చిత్రం రూపొందించాడట తరుణ్ భాస్కర్ . అయితే కొంతమంది దర్శకులకు రెండో చిత్రం బెడిసి కొట్టిన దాఖలాలు ఉన్నాయి దాంతో ఆ సెంటిమెంట్ ని అవలీలగా దాటగలడా తరుణ్ భాస్కర్ చూడాలి .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All