Homeటాప్ స్టోరీస్సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ టాక్

సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ టాక్

positive talk to sudheer babu sammohanamసుధీర్ బాబుఅదితిరావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం ” సమ్మోహనం ” . ఈ చిత్రం ఈరోజు విడుదల అవుతోంది . సినిమా రంగం నేపథ్యంలో తెరకెక్కిన సమ్మోహనం పై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది . సుధీర్ బాబు నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు ఆ చిత్ర బృందం అలాగే ఆ చిత్రాన్ని చూసిన వాళ్ళు . సుధీర్ తో పాటు హీరోయిన్ అదితిరావ్ హైదరి నటన కూడా ఈ చిత్రానికి మరో హైలెట్ అంట !

అదితిరావు హైదరి నటనతోనే కాకుండా గ్లామర్ తో కుర్రకారు ని ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు . ప్రేమకథ గా తెరకెక్కిన ఈ సమ్మోహనం ప్రేక్షకులను కూడా సమ్మోహనం చేయడం ఖాయమని అంటున్నారు . రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . పైగా సరైన సినిమాలు కూడా ఏవి లేవు కాబట్టి సమ్మోహనం హిట్ అవుతుందేమో ! ఇక మహేష్ బాబు బావ సుధీర్ బాబు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సమ్మోహనం పట్ల . అయితే టాక్ సంగతి పక్కన పెడితే ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే కొద్దిగంటలు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All