Homeన్యూస్పవన్ పై హద్దులు దాటి మాట్లాడిన పోసాని

పవన్ పై హద్దులు దాటి మాట్లాడిన పోసాని

పవన్ పై హద్దులు దాటి మాట్లాడిన పోసాని
పవన్ పై హద్దులు దాటి మాట్లాడిన పోసాని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అన్నిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. వైఎస్ఆర్సిపి నాయకులపై నిప్పులు చెరిగాడు పవన్. ఒక మంత్రిని అయితే సన్నాసి అని కూడా పిలిచాడు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికార మంత్రులు, మరికొంత మంది పార్టీ మద్దతుదారులు విడివిడిగా ప్రెస్ మీట్స్ పెట్టి పవన్ వ్యాఖ్యలను ఖండించారు. అందులో కొంత మంది హద్దులు దాటారు కూడా.

ఇదే కోవలో పోసాని కృష్ణ మురళి కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ ను దుమ్మెత్తిపోశాడు. అయితే ఆ తర్వాత పోసాని ఫోన్ కు అభ్యంతకర మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వందల కొద్దీ వచ్చాయిట. దీంతో పోసాని తన విచక్షణ కోల్పోయాడు. నిన్న రాత్రి ప్రెస్ క్లబ్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనాన్ని చూపిస్తున్నాయి.

- Advertisement -

పవన్ ఫ్యాన్స్ నా కుటుంబాన్ని అన్నారు కాబట్టి అలాంటి ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోలేని పవన్ ను నేను అంటాను, వాళ్ళ కుటుంబాన్ని అంటాను అంటూ పోసాని హద్దులు మీరు ఏదేదో మాట్లాడేసాడు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ అమ్మ, భార్య, కూతురు అని లేకుండా ఆడవాళ్లు అందరినీ ఈ టాపిక్ లోకి లాగాడు. ముఖ్యంగా పవన్ కూతురి విషయంలో మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు పోసానిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా పోసాని వ్యాఖ్యలను ఖండించింది. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All