Tuesday, March 21, 2023
Homeన్యూస్స్వయంవద లో జెల్లా వెంకట్రాముడిగా ఆకట్టుకుంటా - పోసాని కృష్ణమురళి

స్వయంవద లో జెల్లా వెంకట్రాముడిగా ఆకట్టుకుంటా – పోసాని కృష్ణమురళి

Svayamvada Posani Krishna Murali
Posani Krishna Murali

విలక్షణ నటనతో ఆకట్టుకునే నటుడు పోసాని కృష్ణమురళి స్వయంవద సినిమాలో తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వివేక్ వర్మ దర్శకత్వం వహించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వయంవద ఈ నెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ. స్వయంవద సినిమాలో నేను జెల్లా వెంకట్రాముడు అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర చాలా బాగుంటుంది. విక్రమ్ రెడ్డి అనే వ్యక్తికి నేను బినామీగా ఉండే పాత్ర. అతను చెప్పినట్లు నడుచుకుంటాను. ఈ క్యారెక్టర్ ఒక దశలో స్వయంవద ను రెచ్చగొట్టి కథను మలుపు తిప్పుతుంది. సింపుల్ గెటప్ లో కనిపిస్తాను. దాదాపు సినిమా అంతా నా పాత్ర సాగుతుంది. నా పాత్రకు కామెడీతో పాటు కథలో ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు వివేక్ వర్మ చక్కగా రూపొందించాడు. కథలో మంచి ఫ్లో ఉంది. సినిమా బాగుంటుందని అతనికి చెప్పాను. స్వయంవద సినిమాలో నటించడం నాకు మంచి అనుభవాన్ని మిగిల్చింది. అన్నారు.

- Advertisement -

అర్చ‌నా కౌడ్లీ, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts