Homeటాప్ స్టోరీస్ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ ఇక లేరు

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ ఇక లేరు

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ ఇక లేరు
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ ఇక లేరు

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ ఈరోజు కన్నుమూశారు. ఆయన లెజండరీ గాయకుడు ఘంటసాల కుమారుడు అన్న విషయం తెల్సిందే. ఘంటసాలకు 4 కుమారులు, 4 కుమార్తెలు. రత్నకుమార్ రెండవ కుమారుడు. ఆయన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. గత 40 సంవత్సరాలుగా డబ్బింగ్ ఫీల్డ్ లో ఉన్నారు రత్నకుమార్.

కంటిన్యూస్ గా 8 గంటల పాటు డబ్బింగ్ చెప్పినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దొరికింది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతంతో కలుపుకుని దాదాపు 1500 చిత్రాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. తెలుగు, తమిళ సీరియల్స్ కలుపుకుని దాదాపు 1500 ఎపిసోడ్స్ కు డబ్బింగ్ చెప్పారు.

- Advertisement -

ఘంటసాల రత్నకుమార్ గత కొంత కాలం నుండి కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ జరుగుతోంది. కానీ రీసెంట్ గా మరి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ఆయన బాగా కోలుకుంటున్నారని, కోవిడ్ నెగటివ్ కూడా వచ్చిందని అన్నారు. కానీ సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All