Homeటాప్ స్టోరీస్అక్కడ హిట్టు ఇక్కడ డిజాస్టర్ అయ్యింది

అక్కడ హిట్టు ఇక్కడ డిజాస్టర్ అయ్యింది

poor publicity chinnababu disaster తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో చినబాబు గా విడుదల చేసారు . ఈనెల 13న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది . ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం అయినప్పటికీ సరైన ప్రమోషన్ లు లేక చినబాబు ప్లాప్ అయ్యింది . ఈ సినిమా మొత్తం మీద మూడు కోట్ల వసూళ్ల ని కూడా రాబట్టలేక పోయిందంటే ఎంత దారుణంగా కలెక్షన్లు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు . కార్తీ కి తమిళ నాట మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది దాంతో అతడి ప్రతీ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉంది అయితే గతకొంత కాలంగా కార్తీ నటించిన సినిమాలు అంతగా ఆడటం లేదు , ఖాకీ చిత్రం బాగానే నడిచినప్పటికీ ఈ చినబాబు పై అంతగా ఆసక్తి లేకుండా పోయింది .

దానికి తోడు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన వాళ్ళు సరైన ప్రచారం చేయకపోవడం కూడా చినబాబు డిజాస్టర్ కావడానికి కారణం అయ్యింది . తమిళనాట ఈ సినిమా మొదటి వారంలో 20 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది కానీ తెలుగులో మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకోవడానికి సరైన పబ్లిసిటీ చేయకపోవడమే ! ఎంతసేపు రైతుల సినిమా అంటూ కలర్ ఇచ్చారు కానీ ఇది చక్కని కుటుంబ కథా చిత్రం . ఉమ్మడి కుటుంబ నేపథ్యానికి రైతుల అంశం ని కూడా జోడించారు . అక్కడ హిట్టు ఇక్కడ ఫట్టు ఇది కార్తీ చినబాబు సినిమా పరిస్థితి .

- Advertisement -

English Title: poor publicity chinnababu disaster

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All