Homeటాప్ స్టోరీస్లారెన్స్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడా ?

లారెన్స్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడా ?

Raghava lawrence
Raghava lawrence

నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ ఆపన్నులను ఆదుకునే మనస్తత్వం కావడంతో పలువురు అభాగ్యులు లారెన్స్ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు . ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేసి గొప్ప పేరు గడించాడు లారెన్స్ . అలాగే దాదాపు 170 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించాడు కూడా . తాజాగా ఓ నిరుపేద కుటుంబం లారెన్స్ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది .

తమిళనాడు కి చెందిన గృహలక్ష్మి అనే యువతి తన రెండేళ్ల కొడుకు కి ఆపరేషన్ చేయించడం కోసం లారెన్స్ ని వెతుక్కుంటూ చెన్నై కి చేరుకుంది . అయితే ఆమెకు లారెన్స్ అడ్రస్ చెప్పేవాళ్ళు లేకపోవడంతో చెన్నై లోనే రైల్వేస్టేషన్ లో పడిగాపులు కాస్తోంది . గృహలక్ష్మి బాధ లారెన్స్ చెవిన పడితే అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల కొడుకుని కాపాడుకోగలుగుతుంది . అయితే పాపం చెన్నై లోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో గృహలక్ష్మి కి లారెన్స్ అడ్రెస్ చెప్పేవాళ్ళు లేరట . అందుకే లారెన్స్ కు ఈ వార్త చేరడానికి కంకణం కట్టుకుంది టాలీవుడ్ డాట్ నెట్ . లారెన్స్ కి ఈ విషయం తెలిస్తే ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఉన్న బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All