Sunday, August 14, 2022
Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ కలెక్షన్లు బాగా పడిపోయాయి

ఎన్టీఆర్ కలెక్షన్లు బాగా పడిపోయాయి

Poor collections for NTR kathanayakudu ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ స్థాయిలో మాత్రం వసూళ్లు లేవు . నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు . జనవరి 9న విడుదలైన ఈ చిత్రం ఫరవాలేదు అనిపించేలా మాత్రమే ఓపెనింగ్స్ రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలలో కంటే అమెరికాలోనే రికార్డ్ స్థాయిలో వసూళ్ల ని రాబట్టింది ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం .

- Advertisement -

 

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం 18 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది . ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 65 కోట్లు అంటే ఇంకా 42 కోట్లు రాబట్టాలి అన్నమాట . సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాతో పాటుగా మిగతా సినిమాలు విడుదల అయ్యాయి కానీ అవి అంతగా ప్రభావం చూపించడం లేదు , వెంకటేష్ ఎఫ్ 2 పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు తెలిసిపోనుంది . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేక దారుణంగా పడిపోవడంతో విస్తుపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ ప్రభావానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ పై దుష్ప్రచారం కూడా కారణం అని అంటున్నారు .

 

English Title: Poor collections for NTR kathanayakudu

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts