Homeటాప్ స్టోరీస్'భీమ్లా నాయక్' ఎలా ఉందంటూ పూనమ్ కౌర్ చాట్..

‘భీమ్లా నాయక్’ ఎలా ఉందంటూ పూనమ్ కౌర్ చాట్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ తో పటు పలు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ భీమ్లా నాయక్ మూవీ ఎలా ఉందంటూ ఎవర్నో అడిగిన చాట్ సోషల్ మీడియా లో షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

- Advertisement -

ట్విట్టర్ లో షేర్ చేసిన దాని ప్రకారం.. అందులో ఓ వ్యక్తి స్టేటస్‏కు వాట్ అంటూ రిప్లై ఇచ్చింది పూనమ్.. దానికి అవతలి వ్యక్తి స్పందిస్తూ… సినిమాకు వచ్చిన అక్క.. బావ సినిమా.. 8am… అంటూ ఫైర్ ఎమోజీస్ ఇచ్చాడు. ఇందుకు పూనమ్ సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీస్ షేర్ చేస్తూ.. నిజాయితీగా రివ్యూ చెప్పమని అడిగింది. సరే అక్క అంటూ అవతలి నుంచి రిప్లై వచ్చింది. .. ఆ తర్వాత కాసేపటికి అవతలి వ్యక్తి నుంచి అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‏ను స్క్రీన్ షాట్ చేసింది. పూనమ్ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారింది. ఇందులో ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నారు..అక్కా.. తమ్ముడు ఎవరు అంటూ అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ చాట్ చేసింది పూనమే ..కావొచ్చు లేదంటే వేరే వారి చాట్ ఈమె ఎందుకు షేర్ చేస్తుందని అంత మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All